Event 2012

కాన్బెర్ర తెలుగు సంఘం తెలుగు కళామ తల్లికి సమర్పించుకొన్న సంగీత స్వరమాలిక “రాగం – తానం – పల్లవి” పాటల పోటీ కార్యక్రమం. మన భాషను పాటలలో, మాటలలో మననం చేసుకొనిమదిలో పదిలపరుచుకొనే వీలును ఈ ఆంగ్ల వాతావరణాన కల్పించాలని తద్వారా మన తెలుగు భాషను కాన్బెర్రాలో అభివృద్ధి పరచాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రత్యేకించి ప్రవాసాన చిన్నారులకొరకై ప్రారంబించబడిన కార్యక్రమం. మొదటి ప్రయత్నంగా 2012 సంవత్సరాన ప్రారంభించబడి ద్వితీయ విఘ్నం లేకుండా 2013 కూడా నిర్వహించబడి అందరికీ నచ్చిన కార్యక్రమం

ఈ పోటీలలో శాస్త్రీయ, జానపద, లలిత మరియు సినీ సంగీతాన్ని ఒకే వేదిక పై నిర్వహించడం ప్రత్యేకత. ప్రవాసాన నివసించే చిన్న పిల్లలు మరియు యువత ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం విసేషదాయకం. ఆస్ట్రేలియా లోని ప్రముఖ అంతర్జాల పత్రిక ” తెలుగు మల్లి” లో ఈ కార్యక్రమాన్ని గూర్చి ఎంతో గొప్పగా కోనియాడబడిన కార్యక్రమం “రాగం – తానం – పల్లవి ”

custom_gallery
images not found
Please follow and like us: